నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే మరో సినిమాతో వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మూడు హిట్స్ అందుకున్న బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఇలా హ్యాట్రిక్ విజయాల తర్వాత ప్రజెంట్ బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ఒక సినిమాకు ( NBK109 ) కమిట్ అయ్యాడు.
బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుంది.ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

మరి తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ తెలుస్తుంది.తాజా షెడ్యూల్ ను అనంతపురంలో( Anantapuram ) ప్లాన్ చేశారట.ఈ నెల మూడో వారంలో ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో జరగనుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉండేలా ప్లాన్ చేశారని బాలయ్య గెటప్, సెటప్ కూడా అదిరిపోయేలా ఉంటుందని టాక్.మరి బాబీ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తున్నాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







