బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ ను తీసుకురానున్నారని సమాచారం.
‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతో న్యూస్ పేపర్ ను బీఆర్ఎస్ ప్రారంభించనుంది.ఈ క్రమంలో త్వరలోనే ఏపీలో పత్రిక అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఆర్ఎన్ఐ అనుమతితో పాటు అన్ని అనుమతులు తీసుకుందని తెలుస్తోంది.రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు బీఆర్ఎస్ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.
ఇప్పటికే తెలంగాణలో నమస్తే తెలంగాణ పేరుతో పత్రిక ప్రజలకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.







