ఏఎన్నార్ బయోపిక్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన నాగార్జున.. ఏమన్నారంటే?

టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున( Hero Nagarjuna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నాగార్జున.ఇకపోతే తాజాగా గోవాలో ఘనంగా జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో దివంగత నటుడు ఏయన్నార్‌కు( ANR ) నాగార్జున నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.

Nagarjuna Speaks About Anr Biopic, Nagarjuna, Anr Biopic, Tollywood, Comments Vi

కాగా ఈ సందర్భంగా శుక్రవారం సెంటినరీ స్పెషల్‌ ఏఎన్నార్‌: సెలబ్రేటింగ్‌ ది లైఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఆఫ్‌ అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అందులో ఈ బయోపిక్ ( Biopic )గురించి మాట్లాడారు.ఏయన్నార్‌ బయోపిక్‌ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

దాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం.

Nagarjuna Speaks About Anr Biopic, Nagarjuna, Anr Biopic, Tollywood, Comments Vi
Advertisement
Nagarjuna Speaks About Anr Biopic, Nagarjuna, Anr Biopic, Tollywood, Comments Vi

ఆయన జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఎదుగుదల పెరుగుతూనే పోయింది.అలాంటి దాన్ని తెరపై చూపాలంటే బోర్‌ కొడుతుందేమో!ఒడుదొడుకులు చూపిస్తేనే సినిమా బాగుంటుంది.

అందుకే ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలి అని తెలిపారు నాగ్.ఆనంతరం తాను నటిస్తున్న సినిమాలపై స్పందిస్తూ.కుబేర, కూలీ సినిమాల్లో చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు నాగార్జున.

ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు