నాగార్జున అక్కినేని( Nagarjuna ) వారసత్వాన్ని గత 35 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara RaO ) లెగిసిని కంటిన్యూ చేయడంలో నాగార్జున సక్సెస్ అయ్యారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అయితే నాగార్జున ఇప్పుడు స్టార్ హీరోగా నెంబర్ వన్ రేసులో దూసుకుపోతున్నాడు కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయనపై అనేక రకాల ఒపీనియన్స్ ఉండేవి.ఆయన నటన పరంగా ఎలా ఉన్నా డైలాగ్స్ చెప్పడంలో మాత్రం బాగా ప్రాక్టీస్ చేసేవారట.
మొహం లో హావాభావాలు పలకకపోయినా సరే ఇచ్చిన డైలాగ్ ని అప్ప చెప్పే వాడట నాగార్జున.ఈ విషయంలో అందరూ ఆయనను మెచ్చుకునే వారట.
పైగా డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడే వాళ్ళంటే ఆయనకు చాలా చిరాగ్గా ఉంటుందట.
అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయనతో పాటు నటించే నటీనటులను ఎక్కువ టేక్స్ తీసుకుంటే అరిచే వాడట నాగార్జున.ఆయనకు అలాంటి సందర్భాల్లో ఎక్కువగా చిరాకు వచ్చేదట.అలా ఎక్కువ సార్లు టేక్స్ తీసుకోవడం వల్ల మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందని షూటింగ్ టైం కూడా ఆలస్యం అవుతుందని దానివల్ల ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడేవాడట.
అందుకే ఎవరైనా సరే ఎక్కువ టేకులు తీసుకోవద్దంటూ డైలాగ్స్ నీ తొందరగా చెప్పేయాలని చెబుతూ ఉండేవారట.మన వల్ల ఎలాంటి ఆలస్యం జరగకూడదని ఆయన కూడా డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేసి సెట్టుకు వచ్చేవారట.
ఇక నాగార్జునకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉండేదట.ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా బాగా గుర్తుంచుకునే వారట.అయినా డైలాగ్ బట్టి పట్టడం పై ఉన్న శ్రద్ధ కాస్త హవా భావాల పైన కూడా చూపిస్తే బాగుంటుందని ఆయన పై సెటైర్స్ కూడా వేసేవారు అప్పట్లో.అయితే ఓసారి ఇలాగే రావు గోపాల్ రావు ( Rao Gopal Rao )గారు ఏదో డైలాగ్ విషయంలో ఆలస్యం చేస్తున్నారని ఆయనపై కాస్త చిరాకు పడ్డారట నాగార్జున.
ఈ విషయంపై ఇండస్ట్రీలో అప్పట్లో వార్తలు వచ్చాయి ఒక లెజెండ్రీ నటుడిని అప్పుడే వస్తున్న నాగార్జున ఏంటి అని కూడా అందరూ అనుకున్నారట.