అక్కినేని నాగార్జున ,అమల ( Akkineni Nagarjuna, Amala ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే మొదట పెళ్లి అయినప్పటికీ కూడా నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత కొద్ది రోజులకు అమల ప్రేమలో పడి ఆమెను వివాహమాడారు.
ఇక వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది.ఇప్పటికి కూడా ఎలాంటి గొడవ రాకుండా ఎంతో ఆనందంగా ఈ జంట ఉంటున్నారు.
ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జున అమలకి అఖిల్ అనే కొడుకు కూడా పుట్టారు.

అయితే అమల నాగార్జున ని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా ఏం తీసుకువచ్చింది అనే విషయం ఓ సందర్భం వచ్చినప్పుడు నాగార్జున చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు.కట్నం తీసుకురమ్మంటే అమల ఆ పని చేసింది అంటూ నాగార్జున చెప్పడంతోనే అందరూ పడి పడి నవ్వారు.మరి ఇంతకీ నాగార్జున కీ అమల ఎంత కట్నం తీసుకువచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు అంటే కట్నాలు కూడా భారీగానే ఉంటాయి.

హీరో అయినా లేదా హీరోయినైనా సరే తమ స్థాయికి తగ్గట్టు పెళ్లిళ్లు చేసుకుంటూ భారీగా కట్నాలు కూడా తీసుకుంటూ ఉంటారు.అయితే అక్కినేని నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీ ( Daggubati Lakshmi ) ని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం భారీగానే తీసుకున్నారు.అయితే ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి పెటాకులు అయ్యాక అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అమల ఎంత కట్నం ఇచ్చింది అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెబుతూ అమల మా ఇంటికి కోడలుగా అడుగు పెట్టిన సమయంలో కట్నంగా డబ్బు తీసుకురాలేదు.
రెండు కుక్కపిల్లల్ని తనతో వెంటపెట్టుకొని తీసుకువచ్చింది అంటూ నాగార్జున ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.ఇక ఈ విషయం విన్న అభిమానులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
అయితే నాగార్జున ఇది సరదాగా చెప్పారా లేదా నిజంగానే తీసుకువచ్చిందా అనేది మాత్రం తెలియదు.