కొత్త కోడలి గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎంతో ఆనందంగా ఉంటూ?

టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ప్రస్తుతం కుబేర, కూలీ( Kubera, coolie ) సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

చైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసని నాగార్జున అన్నారు.

శోభిత చాలా అందమైన అమ్మాయి అని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని నాగ్ కామెంట్లు చేశారు.శోభిత నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని నాగ్ పేర్కొన్నారు.

శోభిత ఎప్పుడూ సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుందని నాగ్ అన్నారు. చైతన్య శోభిత ( Chaitanya, Shobhita )ఎంతో ఆనందంగా ఉన్నారని వాళ్లను చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని నాగ్ పేర్కొన్నారు.

చైతన్య లైఫ్ లోకి శోభిత వచ్చినందుకు నేనెంతో ఆనందిస్తున్నానని నాగార్జున వెల్లడించారు.గూఢచారి సినిమా చూసి శోభితను అభినందించానని నాగ్ అన్నారు.

Advertisement

శోభిత సినీ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తినిస్తుందని నాగ్ చెప్పుకొచ్చారు.

శోభిత గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి అని నాగార్జున వెల్లడించారు.చైతన్య శోభిత కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.టాలీవుడ్ దర్శకనిర్మాతల మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.

శోభిత విభిన్నమైన ప్రాజెక్ట్స్ లో నటించడంతో పాటు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాల్సి ఉంది.నాగచైతన్య త్వరలో తండేల్ సినిమాతో( Tandel ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

2025 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా తండేల్ నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.తండేల్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయి.

భారతీయుల అక్రమ రవాణా.. కెనడియన్ కాలేజీల ప్రమేయం, రంగంలోకి ఈడీ
తండేల్ పై బన్నీ వివాదం ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైందిగా!

చైతన్య 2025లో తండేల్ సినిమాతో శుభారంభం ఇవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఒక్కో సినిమాకు 25 కోట్ల రుపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న నాగార్జున కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు