అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించి అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇప్పటి వరకు నాగార్జున ది ఘోస్ట్ సినిమా గురించి అప్డేట్ లేక పోవడంతో దర్శకుడు ప్రవీణ్ పై అక్కినేని అభిమానులు ఒకింత అసంతృప్తితో.ఆగ్రహంతో ఉన్నారు.
ఎట్టకేలకు సినిమా నుండి క్లారిటీ వచ్చింది.సినిమా షూటింగ్ ను ముగించాం అంటూ అధికారికంగా ప్రకటించారు.
సినిమా షూటింగ్ ను ముగించిన నేపథ్యంలో సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించడమే ఆలస్యం.షూటింగ్ ముగింపు సందర్బంగా ఆ విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చేస్తే బాగుండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇన్నాళ్లు పూర్తి కాని కారనంగా వాయిదా వేస్తూ వచ్చారు.కరోనా సమయం లో సినిమా షూటింగ్ నిలిచి పోయింది.అప్పుడే కాజల్ గర్భవతి అవ్వడం వల్ల ఆమెను తప్పించి.ఆమె తో చేసిన సన్నివేశాలు కూడా మళ్లీ చేయాల్సి వచ్చింది.

ది ఘోస్ట్ సినిమా షూటింగ్ పూర్తి అయిన నేపథ్యం లో ఇన్నాళ్లు గా సినిమా ఎప్పుడు ఎప్పుడు అంటూ ఆసక్తి గా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కు ఇదే ఏడాది సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ క్లారిటీ వచ్చింది.ఈ ఏడాది లో ఎప్పుడు సినిమా వస్తుంది అనేది నాగార్జున లేదా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఈ సినిమా లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.యాక్షన్ సన్నివేశాల్లో మూడు పదుల కుర్ర హీరో మాదిరిగా నాగార్జున నటించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.







