చైతన్య సమంత విడిపోయి దాదాపుగా ఏడాది అయిందనే సంగతి తెలిసిందే.చైసామ్ విడిపోయినా వాళ్లిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా చైతన్య ఇమేజ్ ను ఈ సినిమాలు డ్యామేజ్ చేయలేదనే సంగతి తెలిసిందే.చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు కూడా భారీ ప్రాజెక్ట్ లు కావడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు.
అయితే సమంతకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అన్నా సోషల్ మీడియా ద్వారా వేర్వేరు విషయాలను ఫ్యాన్స్ తో పంచుకోవడం అన్నా చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంలో చైతన్య మాత్రం మరో విధంగా వ్యవహరిస్తున్నారు.
తనకు సోషల్ మీడియా అంటే అస్సలు ఇష్టం లేదనే విధంగా చైతన్య ప్రవర్తిస్తుండటం గమనార్హం.సమంతకు ఇష్టమైనది చైతన్యకు అస్సలు ఇష్టం లేదని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా గురించి నాగచైతన్య తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను సోషల్ మీడియా ఉంచి డిస్ కనెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

నిజానికి నేను ఆన్ లైన్ లో చాలా బోరింగ్ గా ఉంటానని చైతన్య కామెంట్లు చేశారు.నా సినిమా రిలీజయ్యే సమయంలో మాత్రం ఆ సినిమా గురించి పోస్ట్ చేయడం కంటే చదివేందుకు నేను ఎక్కువగా ఆసక్తిని చూపిస్తానని చైతన్య చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూలను వాటి రెస్పాన్స్ లను చదువుతానని మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చైతన్య కామెంట్లు చేశారు.అది గుర్తించని పక్షంలో సోషల్ మీడియా మనకు మంచిది కాదని చైతన్య చెప్పుకొచ్చారు.సోషల్ మీడియా మనల్ని చెడు మార్గంలో తీసుకెళుతుందని నాగచైతన్య కామెంట్లు చేశారు.
చైతన్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







