సమంత నాగచైతన్య కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో చైసామ్ అభిమానులు చాలా సంతోషించారు.చైసామ్ జోడీ బాగుందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పెళ్లి తర్వాత కూడా చైతన్య సమంత సంతోషంగా కనిపించారు.చైసామ్ మధ్య విభేదాలు ఉన్నాయని మీడియాలో కూడా ప్రచారం జరగలేదు.
పెళ్లి తర్వాత చైసామ్ కలిసి నటించిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రియల్ లైఫ్ లో భార్యాభర్తలైన చైసామ్ రీల్ లైఫ్ లో కూడా అవే పాత్రల్లో నటించడం వల్ల మజిలీ సినిమా హిట్టైందని కొంతమంది భావిస్తారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా చైతన్య సమంత విడిపోయి అభిమానులకు భారీ షాకిచ్చారు.అక్టోబర్ 2వ తేదీన చైతన్య సమంత విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనతో అభిమానులు షాక్ కు గురయ్యారు.
ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు చైతన్య నుంచి కానీ సమంత నుంచి కానీ సమాధానం రాలేదు.
అయితే సమంత, చైతన్య విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో నాగచైతన్యను ఫాలో కావడం లేదు.
ట్విట్టర్ లో, ఇన్ స్టాగ్రామ్ లో సమంత అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులను ఫాలో అవుతున్నా చైతన్యను మాత్రం ఫాలో కావడం లేదు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని చైతన్య సమంతను ట్విట్టర్ లో ఫాలో కావడం లేదు.
అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం నాగచైతన్య సమంతను ఫాలో అవుతున్నారు.

నాగచైతన్య సమంతను అన్ ఫాలో చేయడం మరిచిపోయాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా విడిపోయినా సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తప్పేం లేదని భావించి చైతన్య సమంతను ఫాలో అవుతూ ఉండవచ్చని మరి కొందరు చెబుతున్నారు.చైసామ్ భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం లేదని తెలుస్తోంది.







