మత్స్యకారుడిగా నాగచైతన్య కొత్త సినిమా... గట్టిగానే ప్లాన్ చేస్తున్న గీతా ఆర్ట్స్!

అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) ఇటీవల కాలంలో నటించిన థాంక్యూ(Thank You), లాల్ సింగ్ చద్దా(Lalsingh Chadda),కస్టడీ (Custody) సినిమాలు మూడు వరుసగా డిజాస్టర్లు కావడంతో నాగచైతన్య పూర్తిగా డీలా పడిపోయారని తెలుస్తుంది.ఇలా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈయన తదుపరి చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

 Nagachaitanya Fisherman Role In Chandu Mondeti Film Details, Nagachaitanya,thank-TeluguStop.com

నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti)దర్శకత్వంలో చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేస్తుంది.ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్(Geetha Arts) భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

Telugu Allu Aravind, Chandoo Mondeti, Geetha, Lalsingh Chadda, Nagachaitanya-Mov

ఇక ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) కీలకమైన అప్డేట్ విడుదల చేశారు.గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడి(Fisherman) పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.గుజరాత్ కి చెందిన ఓ మత్స్యకారుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.నిజానికి గుజరాత్ నుంచి ఎక్కువగా జాలర్లు పాకిస్తాన్ నేవీ చేతుల్లో చెక్కి జైలు శిక్ష అనుభవించిన కథలు ఎన్నో బయటకు వచ్చాయి.

బహుశా అలాంటి కథ ఏదైనా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో రాసుకున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Aravind, Chandoo Mondeti, Geetha, Lalsingh Chadda, Nagachaitanya-Mov

నాగచైతన్య సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు కేటాయించని బడ్జెట్ ఈ సినిమాకు కేటాయిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కోసం దాదాపు 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.కథపై నమ్మకమే కాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి కావడంతో ఆయనపై నమ్మకంతోనే నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడానికి కూడా వెనకాడటం లేదని తెలుస్తుంది.60 కోట్ల బడ్జెట్ అంటే భారీగానే సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.మరి ఈ సినిమా అయినా నాగచైతన్యకు సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి అయితే ఇదివరకు ఈయన గీత ఆర్ట్స్ లో నటించిన 100% లవ్ సినిమా(100% Love Movie) ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube