టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) నాగచైతన్యలకు( Naga Chaitanya ) ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ ఇద్దరు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.
గుండమ్మ కథ మూవీ రీమేక్ లో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.అయితే కొన్ని విషయాలలో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య సేమ్ టు సేమ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య బాల్యంలో తల్లి దగ్గర పెరిగిన హీరోలు కావడం గమనార్హం.ఈ ఇద్దరు హీరోలు బాల్యం నుంచి యాక్టింగ్ కొరకు అవసరమైన నైపుణ్యాలను అలవరచుకున్నారు.
ఈ ఇద్దరు హీరోల వాయిస్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య డైలాగ్ లను చెప్పే విధానం( Dialogue Delivery ) ఇతర హీరోలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.
ఎమోషనల్ సీన్స్ లో( Emotional Scenes ) ఈ ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించగలరు.

జూనియర్ ఎన్టీఆర్, చైతన్య కలిసి ఎక్కువగా కనిపించకపోయినా ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి అనుబంధం ఉందని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్, చైతన్య కాంబినేషన్ లో సినిమా రావాలని నందమూరి, అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఏ స్టార్ డైరెక్టర్ అయినా ఈ కాంబో దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.
ఎన్టీఆర్, చైతన్య కాంబో క్రేజీ కాంబో అవుతుందని చెప్పవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో( Devara ) నటిస్తుండగా నాగచైతన్య తండేల్( Thandel ) సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి.ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కెరీర్ ప్లానింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.ఈ ఇద్దరు హీరోలు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.