నాగబాబు కౌంటర్ అదిరింది.. మరి బాలకృష్ణది ఎప్పుడో?

వైసీపీ మంత్రి , నటి రోజా తన రాజకీయ ప్రత్యర్థులపై ఎలా టార్గెట్ చేస్తుందో అందరికి తెలిసిందే.తీవ్రమైన పదజాలంతో ప్రత్యర్ధులపై విరుచుకుపడడంలో ఆమె స్టైలే వేరు టీడీపీ, జనసేన నేతలపై ఆమె తరచూ రెచ్చగొట్టే పదజాలం ఉపయోగిస్తుంటారు.

 Nagababu's Counter Is Over And When Is Balakrishna's, Nagababu, Minister Roja, P-TeluguStop.com

ఈ నేపధ్యంలో రోజాను జనసేన ఫైరింగ్ లైన్ లో పెట్టింది.ఇప్పుడు ఏకంగా జనసేన నేత నాగబాబు రంగంలో దిగారు.

అంతకుముందు, రోజాను పిలిచిన వీడియో బైట్‌ను నాగ బాబు విడుదల చేశారు.“పర్యాటక మంత్రిగా ఉండటం అంటే మీరు టోరస్‌పై వెళ్లడం కాదు, పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేయడం.

కానీ మీరు చేసేదంతా నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే” అని నాగబాబు తీవ్రంగా స్పందించారు.  “రోజా మున్సిపాలిటీ కుప్ప తొట్టి లాంటిది.ఆమె శాఖపై  ఎలాంటి పట్టులేదని  ఇతర పార్టీలపై ఏడవడమే ఆమె పని అన్నారు.  భారతదేశంలోని పర్యాటక రాష్ట్రాల జాబితాలో ఏపీ 18వ స్థానంలో ఉందని నాగబాబు గణాంకాల డేటాను కూడా చూపించారు.

రోజా లాంటి వారు మంత్రి పదవుల్లో ఉంటే పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు.ఈ #KuppaThottiRoja హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది.

ఇదే విషయమై జనసేన సోషల్ మీడియా విభాగం బాగ వైరల్ చేస్తుంది.

అయితే ఇనాళ్ళు సైలెంట్‌గా ఉన్న నాగాబాబు ఇప్పుడు ఎందుకు ఫైరయ్యాడనేది అందరిని ఆశ్ఛర్యపరించింది.

జబర్ధప్ షోలో జడ్జీలుగా ఉన్న వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు.అయితే నాగబాబు మాటల వెనుక జనసేన నాయకుల మోథోమథనం ఉన్నట్లుగా అర్ధమవుతుంది.

రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే నాగబాబే కరెక్ట్ అని భావించింది.దీంతో వారి సూచనల మేరకు నాగబాబు రంగంలోకి దిగారు.

అయితే జనసేన నుండి నాగబాబు ఫైరయ్యాడు కాబట్టి టీడీపీ నుండి రోజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఎప్పుడని తెలుగుదేశం అభిమానులు ఎదురుచూస్తున్నారు.రోజుకు కౌంటర్ ఇవ్వాలంటే బాలయ్య బాబె కరెక్ట్ అని భావిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube