బాలయ్య బాబు ని వాడేసుకుంటున్న నాగబాబు ... ఈసారి ఏకంగా షార్ట్ ఫిల్మ్ తోనే

నందమూరి హీరో బాలకృష్ణ మీద మెగా బ్రదర్ నాగబాబు పీకల్లోతు కోపం పెంచేసుకున్నట్టున్నాడు.అంతే కాదు ఆ కోపం ఇప్పుడప్పుడే చల్లారేలా కూడా కనిపించడంలేదు.

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాగ బాబు ఆపరేషన్ బాలయ్య అనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు.మొన్నామధ్య సోషల్ మీడియాలో బాలయ్యను ఉద్దేశించి.

ఓ దున్నపోతు.ఓ ఫిట్ బుల్ బ్రీడ్ డాగ్ పెట్టి వీటి బ్లడ్ .బ్రీడ్ వేరే అంటూ.కౌంటర్ వేసాడు.

అలాగే గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.

Advertisement
Nagababu Counter To Ballakrishna On A Short Film1-బాలయ్య బాబ�

ఇపుడు మెగా బ్రదర్ నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా ‘ఎర్రోడి వీరగాథ’ అనే షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Nagababu Counter To Ballakrishna On A Short Film1

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఎర్రోడి వీరగాథ’ అంటూ షార్ట్ ఫిల్మ్‌ని విడుదల చేయడం బాలయ్య అభిమానులను కలవరపెడుతోంది.మూడున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని చితక్కొట్టడం.వాళ్లని అడ్డుకుని ఇంతకీ ఎందుకు కొడుతున్నారు ఏమైందిరా? అని ఆ వ్యక్తిని నాగబాబు అడగడం.దానికి అతడు పెద్దోళ్లు చెప్పారు కదా.‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అని అందుకే ముద్దు అడిగా అందుకే కొడుతున్నారని ఆ వ్యక్తి చెప్పడం.దానికి షాకైన నాగబాబు ఆడవాళ్లను పిలిచి మరీ ఆ వ్యక్తిని చితక్కొట్టించడం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు