యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నాగశౌర్య ( Naga Shaurya ) గత సంవత్సరం నవంబర్ 20న బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇక వీరి పెళ్లి గ్రాండ్ గానే జరిగింది.
అయితే ఇంకా గ్రాండ్ గా చేయాలి అని నాగశౌర్య ఫ్యామిలీ అనుకున్నప్పటికీ నాగశౌర్య కి అలా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదంట.అందుకే సింపుల్ గా పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ అనుష రెడ్డి ( Anusha Reddy ) వారి తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె కావడంతో వారి కోరిక మేరకు ఆ మాత్రం గ్రాండ్గా చేశారట.
లేకపోతే నాగశౌర్య ఇంకా సింపుల్గా పెళ్లి చేసుకోవాలని చూసారట.ఇక నాగశౌర్య ఓ వైపు సినిమాలతో పాటు ఈ మధ్యనే ఓ రెస్టారెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు.
ఇక ఈ రెస్టారెంట్ బిజినెస్ గురించి ఇప్పటికే చాలాసార్లు నాగశౌర్య తల్లి ఉష ( Usha ) చెప్పుకొచ్చింది.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఉష మాట్లాడుతూ.
నేను నా కోడల్ని కూతురు లాగా చూసుకుంటాను.కానీ పెళ్లైన నెలకే వేరు కాపురం పెట్టుకుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
మరి వీరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయా.ఎందుకు అనూష రెడ్డి వేరు కాపురం పెట్టింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లైన నెలకే నాగశౌర్య వేరు కాపురం పెట్టారంటే అత్తాకోడళ్లకి పడలేదు కావచ్చు అని కొంతమంది అనుకుంటారు.కానీ అలాంటిదేమీ లేదు అని నాగశౌర్య తల్లి ఉష క్లారిటీ ఇచ్చింది.మా కోడలు అనూష ని మేము కూతురు లాగా చూసుకుంటాం.అలాగే ఆమె కూడా నన్ను నా భర్తను మమ్మా, డాడీ అని పిలుస్తుంది.అత్త మామ అని అస్సలు పిలవదు.

ఇక పెళ్లయినా కొద్ది రోజులకే వాళ్ళు వేరుకాపురం పెట్టారు.అయితే ఇందులో ఎలాంటి గొడవలు లేవు.కానీ మేం పెళ్లి కాకముందుకే నిర్ణయం తీసుకున్నాం.
ఎందుకంటే వాళ్లు ఇప్పటి జనరేషన్ పిల్లలు కాబట్టి వారికి ప్రైవసీ ఇవ్వడమే మంచిది అని మేం భావించాం.ఇక అప్పుడప్పుడు కలిస్తేనే బంధాలు బాగుంటాయి అని అలా చేసాం.
అంతేకానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ నాగశౌర్య తల్లి ఉష ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.







