యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో అనీష్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణ వ్రిందా విహారి.నాగ శౌర్య సొతన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా షెర్లే సెతియా నటిస్తుంది.
ఈమధ్యనే రిలీజైన టీజర్ ప్రేక్షకులను మెప్పించగా అసలైతే ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ రిలీజ్ ని నెల రోజులు వాయిదా వేసుకున్నారు చిత్రయూనిట్.
ఏప్రిల్ 22న రిలీజ్ అనుకున్న నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి సినిమాను మే 20న రిలీజ్ ఫిక్స్ చేశారు.
మే నెలలో కూడా భారీ సినిమాలు ఉన్నాయి.
ఆల్రెడీ మే 6న రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా మే 12న సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది.మే 27న ఎఫ్3 సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు.
మొత్తానికి మహేష్ సర్కారు వారి పాట తర్వాత నాగ శౌర్య సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.అనీష్ కృష్ణ, నాగ శౌర్య ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.
నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







