అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya )ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.
అయితే ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా అలాగే ఇటీవలే వచ్చిన కస్టడీ కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.
వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్ర నిరాశ పరిచింది.ఇక ఈ సినిమా తర్వాత చైతూ నుండి మరో సినిమా రాలేదు.
అయితే ఇప్పుడు ”దూత” అనే వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.విక్రమ్ కే కుమార్( Vikram K Kumar ) ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసాడు.
మొదటిసారి ఓటిటి డెబ్యూ ఇవ్వబోతున్న చైతన్య దూత ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో( Amazon Prime Video ) ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది.తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
తొలిసారి ఓటిటి ఎంట్రీ ఇస్తుండడం మంచి ఎక్స్పీరియన్స్ అని.అలాగే డైరెక్టర్ విక్రమ్ దూత సిరీస్ ను అద్భుతంగా తెరకెక్కించాడని.తాను ప్రజెంట్ చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న తండేల్ ( Thandel ) కూడా అద్భుతంగా తెరకెక్కుతోందని తెలిపాడు.
అంతేకాదు తనకు బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ, రోహిత్ శెట్టి, సంజయ్ లీలా భన్సాలీ, అనురాగ్ కశ్యప్ వంటి వారితో వర్క్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.