అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్( Nagarjuna, Naga Chaitanya, Akhil ) లు వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు.ఈ ఏడాదిలో ఇప్పటికే అఖిల్ ‘ఏజెంట్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే.
అఖిల్ ఏజెంట్ ( agent )వచ్చిన కొంత గ్యాప్ కే నాగ చైతన్య హీరోగా కస్టడీ ( Custody )సినిమా వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తే అది కూడా నిరాశ పర్చింది.
పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేశారు కానీ అది బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన కథ మరియు కథనం అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కటే అయినా వారిలో కూడా కొందరు అఖిల్ ను అభిమానించే వారు ఉంటారు.కొందరు నాగ చైతన్య ని అభిమానించే వారు ఉంటారు.
అఖిల్ ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆ వెంటనే వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా విడుదల అవ్వడంతో చాలా మంది ఆసక్తిగా చూశారు.

ముఖ్యంగా అఖిల్ అభిమానులు కస్టడీ సక్సెస్ అయితే అఖిల్ బాబు ఈగో హర్ట్ అవుతుందని భావించారట.కస్టడీ నిరాశ పర్చడంతో వారు కాస్త సంతోషం వ్యక్తం చేశారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.కొందరు మాత్రం అక్కినేని ఫ్యాన్స్( Akkineni fans ) అంతా ఒక్కటే అని.వారు ఫ్యామిలీ లో ఏ ఒక్కరి సినిమా హిట్ అయినా కూడా అంతా ఆనందం వ్యక్తం చేస్తారు.ఏ ఒక్కరి సినిమా ఫ్లాప్ అయినా కూడా వారు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కానీ ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో అభిమానులు అసహనం వ్యక్తం చేసేది ఏమీ ఉండదు అంటూ కొందరు అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







