ఎన్టీఆర్ కి తల్లిగా మారుతున్న పవన్ కళ్యాణ్ అత్త

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియా టాలీవుడ్ లో మిర్చి సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది.

హీరోయిన్ గా ఉన్న సమయంలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకున్నా ఇప్పుడు మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

అది కూడా సినిమాలలో కీలక పాత్రల కోసం దర్శకులు ఆమెకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.ఇక అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్త పాత్రతో ఆమె ఒక్కసారిగా స్టార్ నటిగా మారిపోయింది.

ఇక తరువాత త్రివిక్రమ్ అఆ సినిమాలో నితిన్ కి అత్తగా కూడా అదే స్థాయిలో పాత్ర చేసింది.అలాగే దృశ్యం సినిమాలో ఆమెచేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఆమె చేస్తున్న పాత్రలు అన్ని కూడా సినిమాలో హీరోలతో సమానంగా ఉంటాయి.ప్రస్తుతం తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న నదియా కాస్తా గ్యాప్ తర్వాత మరల తెలుగులో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

అది కూడా మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీకే.ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఇందులో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ తల్లిగా నదియాకే త్రివిక్రమ్ ఓటు వేసినట్లు తెలుస్తుంది.

ఇక ఆమె కూడా త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో చేయడానికి ఒకే చెప్పెసినట్లు సమాచారం.అయితే అధికారికంగా చెప్పేంత వరకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు.

ఎటూ తేలని 'ఖమ్మం ' కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ? 

Advertisement

తాజా వార్తలు