దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించడంతో అందరు హ్యాపీ గా ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ప్రొమోషన్స్ చేసారు.
మన తెలుగులో కూడా ప్రొమోషన్స్ జోరు చూపించారు.అనిల్ రావిపూడి, కీరవాణి, సుమ, సందీప్ వంగ వంటి స్టార్ లతో ఇంటర్వ్యూ లు చేసి ఈ సినిమాపై మరింత హైప్ పెంచారు.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో ఆసక్తికర విషయాలు చెబుతూ ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పెంచుతూ వచ్చారు.సుమ తో జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఒక ఆసక్తికర విషయం తెలిపారు.
ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సాంగ్ లో తారక్, చరణ్ స్టెప్పులకు అలా చూస్తుండిపోయారు.
అయితే ఈ స్టెప్పులు వేయడానికి రాజమౌళి ఎంత టార్చర్ పెట్టాడో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.ఈ సాంగ్ లో హుక్ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది.ఈ హుక్ స్టెప్ కోసం ఏకంగా 17 టేక్ లు తీసుకున్నాడట.అయితే ఇక్కడే అసలు విషయం చెప్పాడు తారక్.ఈ సాంగ్ 17 టేక్ లు చేసిన తర్వాత రాజమౌళి చూసి అందులో 2 వ టేక్ ఓకే చేసాడట.సుమ తో ఎన్టీఆర్ ఈ విషయాన్నీ తెలిపాడు.
రాజమౌళి మాత్రం పెర్ఫెక్షన్ కోసమే ఇన్ని టేక్ లు తీసుకున్నానని తెలిపాడు.