సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా బుల్లితెరపై ప్రసారమవుతున్నాయి.ఇప్పటికే సైంధవ్ బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో పట్టు ఉన్న నాగార్జున( Nagarjuna ) మాత్రం బుల్లితెరపై అదరగొట్టారు.ఈ సినిమాకు బుల్లితెరపై 8.08 రేటింగ్ రావడం గమనార్హం.నాగార్జున రేంజ్ కు ఇది మరీ గొప్ప రేటింగ్ అని చెప్పలేం.
అయితే ప్రస్తుతం సినిమాలకు వస్తున్న రేటింగ్ లతో పోల్చి చూస్తే ఈ రేటింగ్ బెటర్ రేటింగ్ అనే చెప్పాలి.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్( Star Maa ) లో ఈ సినిమా ప్రసారమైంది.
విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.నాగ్ కెరీర్ లో తక్కువ రోజుల్లో షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పవచ్చు.

కథ, కథనం మరీ కొత్తగా లేకపోయినా నాగ్ స్టైల్ కు సరిపోయే సినిమా కావడం అషికా రంగనాథ్( Ashika Ranganath ) అద్భుతమైన నటన ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి ఆ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.నా సామిరంగ సినిమాతో నాగ్ బుల్లితెరపై కూడా నా సామిరంగ( Naa Saami Ranga ) అనిపించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా( Guntur Kaaram కూడా ఉగాది పండుగ కానుకగా బుల్లితెరపై ప్రసారం కానుంది.హనుమాన్ మూవీ( Hanuman Movie ) శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సొంతం కాగా ఈ సినిమా మాత్రం బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియాల్సి ఉంది.నా సామిరంగ సక్సెస్ తో ఇకపై కూడా నాగార్జున పల్లెటూరు బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది.







