నాగార్జున, అషికా రంగనాథ్ ( Nagarjuna, Ashika Ranganath )కాంబినేషన్ లో విజయ్ బిన్నీ ( Vijay Binny )డైరెక్షన్ లో తెరకెక్కిన నా సామిరంగ మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతుండగా ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో నా సామిరంగ మూవీ అదరగొట్టిందనే చెప్పాలి.
నా సామిరంగ( na samiranga ) నైజాం ఏరియాలో కోటీ 20 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించగా సీడెడ్ ఏరియాలో 85 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
గుంటూరులో ఈ సినిమాకు 47 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా వైజాగ్ లో 50 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఉభయ గోదావరి జిల్లాలలో ఈ సినిమాకు 90 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 23 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

నెల్లూరు ఏరియాలో ఈ సినిమాకు 18 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4.33 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.మల్టీప్లెక్స్ లలో అదిరిపోయే బుకింగ్స్ తో ఈ సినిమా సత్తా చాటుతుండటం గమనార్హం.
నా సామిరంగ సక్సెస్ తో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత నాగార్జున మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నా సామిరంగ సినిమాతో అషికా రంగనాథ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.







