పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చిన మైత్రీ

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులని కూడా పవన్ సొంతం చేసుకున్నాడు.సల్మాన్ దబాంగ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఆ చాయలు ఎక్కగా కనిపించకుండా పవన్ కళ్యాణ్ వన్ మెన్ షోతో సినిమా రేంజ్ కంప్లీట్ గా మారిపోవడంతో స్ట్రైట్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది.

Mythri Producers Gives Clarity On Pawan Kalyan Movie, Harish Shankar, Tollywood,

అలాగే సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ కూడా భాగా వర్క్ అవుట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.ఇదిలా ఉంటే గత కొంత కాలంగా పవన్, హరీష్ మూవీపై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.

Advertisement

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఇప్పటికే ఖరారు అయిపోయిందని టాక్ వచ్చింది.అలాగే ఆగష్టులో ఈ మూవీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఈ మూవీపై ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీపై జరుగుతున్న ఏ ఒక్క ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు.

ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ ఉగాది రోజు రిలీజ్ చేద్దామని అనుకున్నాం కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వర్క్ అవుట్ కాలేదు.ఈ సినిమా కచ్చితంగా అభిమానులు కోరుకునేదానికంటే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

అయితే ఎలాంటి అప్డేట్ అయిన అఫీషియల్ గా తమ నుంచి వచ్చే వరకు వెయిట్ చేయండి అని మైత్రీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు