Allari Naresh: పెళ్లికి ముందు నేను హీరో అని నా భార్యకు తెలియదు.. అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్!

అల్లరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి హిట్ అందుకున్న నరేష్ తన పేరు పక్కన అల్లరి సినిమా పేరును కూడా పెట్టుకొని అల్లరి నరేష్ గా మారిపోయారు.ఇలా ఇండస్ట్రీలో పలు కామెడీ సినిమాలలో నటించి కామెడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ క్రమక్రమంగా తన సినిమాల ఎంపిక విషయంలో తడబడటంతో వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.

 My Wife Didnt Know That I Am A Hero Before Marriage Allari Naresh Comments Viral-TeluguStop.com

ఇలా నటుడుగా కొనసాగుతున్నటువంటి నరేష్ వివాహం అనంతరం సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు.

ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడటంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నరేష్ నాంది సినిమాతో మంచి హిట్ కొట్టారు.

ఈ సినిమా అనంతరం తన కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.ఇక తాజాగా ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లరి నరేష్ ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరై తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలు గురించి వెల్లడించారు.

Telugu Allari Naresh, Allarinaresh, Itlumaredumilli, Naandi-Movie

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు ముఖ్యంగా తన భార్య విరూప గురించి మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి చెన్నైలోనే పుట్టి పెరగటం వల్ల తనకు పెద్దగా తెలుగు సినిమాల గురించి అవగాహన లేదని తెలిపారు.ఈ విధంగా తెలుగు సినిమాలు కూడా చూసేది కాదని ఒకవేళ చూసిన స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చూసేదని అందుకే తాను హీరో అనే విషయం కూడా పెళ్లికి ముందు వరకు తన భార్యకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.సినిమాలలో ఉన్నానంటే హీరోగా కాకుండా వేరే డిపార్ట్మెంట్లో పని చేస్తున్నానని అనుకుంది పెళ్లి తర్వాతే నేను హీరో అనే విషయం తనకు తెలిసిందని నరేష్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube