కేవలం 6 లక్షల పొదుపుతో 1.25 కోట్లను సొంతం చేసుకోండి..!

అవును.మీరు వింటున్నది అక్షరాలా నిజం.

మనలో దాదాపుగా రేపటి గురించి అలోచించి ఈరోజు పైసా పైసా కూడబెడుతున్నవారే.

చాలా మంది చాలా రకాలుగా డబ్బును పొదుపు చేస్తూ వుంటారు.

Get Rs 1-25 Crore With Just Rs 6 Lakh Savings Mutual Fund, Sip,money, Bank Acco

ఇందులో కొంతమంది గుడ్డిగా తమ బీరువాలలో దాస్తూ వుంటారు.ఇంకొంతమంది బ్యాంకు ఖాతాలలో దాచిపెడతారు.

మరికొందరు తెలివిగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ వుంటారు.అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వలన సదరు కస్టమర్లు కోటీశ్వరులు కావడం సాధ్యమా.

Advertisement

అనే ఆలోచన తప్పక వస్తుంది.ఇప్పుడు అది సాధ్యమే అంటున్నారు కొందరు ఆర్ధిక నిపుణులు.

అవును.చక్కటి ఆర్థిక ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడితో అతి పెద్ద మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందవచ్చు అని చెబుతున్నారు.

అయితే దీని కోసం మీరు చేయవలసింది ఒక్కటే.పూర్తి క్రమశిక్షణతో డబ్బును మదుపు చేయడమే.

ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఎంతో ఉత్తమమైన మార్గం.కేవలం రూ .1800 మొత్తంతో SIP ప్లాన్ ను మొదలు పెట్టవచ్చు.దీని కోసం, పొదుపు దారుడు రోజుకు కేవలం రూ.60 మాత్రమే ఆదా చేయవలసి ఉంటుంది.ఇలా.పొదుపులో క్రమశిక్షణను పాటించడం, రోజుకు 60 రూపాయలు ఆదా చేయడం వలన పొదుపు దారుడు 30 సంవత్సరాల్లో కోటి రూపాయల ఫండ్ రిటర్న్ పొందుతాడు.ఇకపోతే, ఇలా 30 సంవత్సరాల పాటు నెలవారీ 1800 రూపాయల SIP పై 15% రాబడి వస్తే.మ్యూచువల్ ఫండ్స్ SIP కాలిక్యులేటర్ 30 సంవత్సరాల చివరిలో రూ .1,26,17,677ను మెచ్యూరిటీ మొత్తంగా ఇస్తుందని సమాచారం.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు