ఎయిర్‌టెల్, జియో కస్టమర్లు 5జీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

భారతదేశంలోని కొన్ని సెలెక్టెడ్ సిటీలలో అక్టోబర్ 1 నుంచి 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

 Must Know Information For Airtel And Jio 5g Users Details, India, 5g Internet Se-TeluguStop.com

అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటిగా ఎయిర్‌టెల్ 5జీ సేవల అవైలబిలిటీ గురించి తెలుసుకుందాం.

దేశంలో 5జీ సేవలను తీసుకురావడంలో అన్ని ఇతర టెలికామ్ సంస్థల కంటే ఎయిర్‌టెల్ ముందుంది.ఇండియాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా వంటి 4 మెట్రో సిటీలతో సహా మరో 4 ఇతర సిటీలలోనూ నిన్నటి నుంచి 5జీ సేవలు తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

మార్చి, 2024 నాటికి భారతదేశమంతటా 5జీ సేవలను విస్తరిస్తామని ఇప్పటికే ఈ కంపెనీ తెలిపింది.అయితే అధికారికంగా 5జీ ప్లాన్ రేట్స్ ఎంత ఉంటాయనేది కంపెనీ తెలపలేదు.

కాకపోతే వీటి ధరలు 4జీ కంటే కాస్త అధికంగా ఉండొచ్చు.

ఇక రిలయన్స్ జియో 5జీ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి రెడీ అయ్యింది.

ఇండియాలో ఈ దీపావళి నాటికి 5జీ ప్లాన్లను రివీల్ చేయాలని జియో ప్రణాళికలు రచిస్తోంది.

దీనర్థం వీటి ధరలు ఇండియాలో ఎంత ఉంటాయనేది అక్టోబర్ 22-26 మధ్య కాలంలో తెలిసే అవకాశం ఉంది.ఈ దిగ్గజ టెలికాం సంస్థ ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో 5జీ సేవలను మొదటగా పరిచయం చేయనుంది.డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేనుంది.

ఈ 5జీ సేవలను యాక్సెస్ చేయాలంటే 5జీ ఫోన్లు కొనుగోలు చేయక తప్పదు.అయితే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడే పూర్తిస్థాయిలో 5జీ సేవలు రోల్ ఔట్ అవ్వవు కాబట్టి మెల్లగా మంచి ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేయడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube