'హాయ్ నాన్న' ఆడియో హక్కుల డీల్ క్లోజ్.. ఆ దిగ్గజ సంస్థకు సొంతం!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరికొత్త మూవీ ‘‘హాయ్ నాన్న‘( Hi Nanna )’.ఎప్పుడు డిఫరెంట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి మంచి సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Music Label T Series Grabbed The Audio Rights Of Hi Nanna-TeluguStop.com

ఈ మధ్య వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న నానికి దసరా వంటి బ్లాక్ బస్టర్ పడడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

దసరా సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయగా బాగా అలరించింది.ఇక నాని ప్రజెంట్ తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్</em( Mrunal Thakur )ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇది రిలీజ్ చేసాక మరిన్ని అంచనాలు పెరిగాయి.బ్యూటిఫుల్ పోస్టర్ తో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.”హాయ్ నాన్న” అనే క్యాచీ టైటిల్ కు గ్లింప్స్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.ఇదిలా ఉండగా ఈ సినిమా గ్లింప్స్ వచ్చినప్పటి నుండి ఏదొక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా ఆడియో హక్కుల గురించి వార్త వైరల్ అయ్యింది.

ఆడియో హక్కుల డీల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది.టి సిరీస్ సంస్థ వారు ఈ ఆడియోను దక్కించు కోవడం విశేషం.భారీ ధరకు హాయ్ నాన్న ఆడియో హక్కులను ఈ బాలీవుడ్ దిగ్గజ సంస్థ దక్కించు కున్నట్టు అనౌన్స్ చేసారు.ఇక ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ పోషించనుండగా.

వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి( Mohan Cherukuri ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube