సంగీత దర్శకుడు రఘుకుంచే ఇంట విషాదం!

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా,సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రఘుకుంచే ఒకరు.ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించడమే కాకుండా ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇండస్ట్రీలో తనకంటూ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Music Director Raghu Kunche Father Passed Away Details, Music Director Raghu Kun-TeluguStop.com

ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రఘుకుంచే ఇంట తీవ్ర విషాదం నెలకొంది.రఘు కుంచే తండ్రి కుంచె లక్ష్మీనారాయణ మంగళవారం మృతి చెందారు.

ఈయన వయో వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు.ఇలా ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి లక్ష్మీనారాయణకు ఇంటి వద్దనే చికిత్స అందించుతున్నప్పటికీ ఈయన మంగళవారం తుది శ్వాస విడిచారు.

దీంతో రఘు ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.ఇక ఈయన హోమియో వైద్యుడిగా పని చేశారు.ఇక తన తండ్రి లక్ష్మీనారాయణ తనకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి అనే విషయాన్ని గ్రహించి తనని సంగీతం వైపు ప్రోత్సహించారని కేవలం తన తండ్రి చూపిన చొరవతోనే తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానని

ఇదివరకు ఎన్నోసార్లు తన తండ్రి గురించి రఘు కుంచె తెలియజేశారు.ఇలా తన తండ్రి తనని వెనకుండి ముందుకు నడిపించారని అలాంటి తండ్రి మరణం ఆయనకు తీరని లోటు అని తెలుస్తోంది.ఇక రఘు కుంచె తండ్రి మరణించారనే వార్త తెలియగానే పలువురు సినీ సెలబ్రిటీలు రఘు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube