ఫిబ్రవరిలో సమ్మెకు పిలుపునిచ్చిన బ్రిటన్ రైల్వే కార్మికులు..

గత సంవత్సరం నుంచి వరుస సమ్మెలతో బ్రిటన్ అతలాకుతులమైపోతోంది.తాజా గా నాలుగు శాతం వేతన పెంపుదలను కోరుతూ రైల్వే డ్రైవర్లు ఫిబ్రవరి లో సమ్మె చేపట్టనున్నారు.

 Britains Railway Workers Called For A Strike In February ,britains Railway Worke-TeluguStop.com

ఈ సమ్మె ఫిబ్రవరి 1, 3 వ తేదీల్లో జరుగుతున్నట్లు రైల్వే డ్రైవర్ల యూనియన్ మంగళవారం వెల్లడించింది.ఈ సందర్భంగా యు.ఎస్ కార్యదర్శి మిక్ విలన్ మాట్లాడుతూ 2019 నుంచి రైల్వే డ్రైవర్లకు జీతాల పెరుగుదల లేదు.

ప్రభుత్వనికి మద్దతు గా ఉన్న కంపెనీలు ఈ విషయాన్ని గుర్తించాలి.నాలుగు శాతం వేతనం పెంచమని రైల్వే డ్రైవర్లు న్యాయమైన ప్రతిపాదన చేసిన ఇప్పటి వరకు ఆమోదయోగ్యం కాలేదు.డ్రైవర్ల జీతాలు పెంచేందుకు, సమ్మెల పరిస్థితిని మార్చేందుకు కంపెనీలు చర్చలు జరపాలని యూనియన్ కోరుతుంది.

సమస్యల పై కంపెనీలు జరుపబోయే తదుపరి చర్యల్లో పాల్గొనేందుకు మా యూనియన్ కూడా సిద్ధం అని ఆయన వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరి లో జరగబోయే సమ్మె లో ఏ ఎస్ ఎల్ ఈ ఎఫ్ యూనియన్ నుంచి సుమారు 12,500 మంది రైల్వే డ్రైవర్లు సమ్మె లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.అంతే కాకుండా వివిధ రవాణా రంగాల్లో పని చేస్తున్న డ్రైవర్ల యూనియన్ ఆర్ఎం టి నుంచి కూడా సుమారు 80,000 మంది సభ్యులు ఫిబ్రవరి సమ్మె లో పాల్గొంటారని మిక్ విలన్ వెల్లడించారు.అయితే కేవలం ఈ సమ్మెలో రవాణా రంగంలోని వారు మాత్రమే కాకుండా పబ్లిక్ సెక్టార్ వర్కర్స్ కూడా ఫిబ్రవరిలో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.

చూడాలి మరి ఈ సమ్మెను బ్రిటన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube