కోటి విడుదల చేసిన 'విక్రమ్' మొదటి పాట

నాగ వర్మ హీరోగా దివ్యా రావు కథానాయిక గా ‘విక్రమ్‘ పేరుతో ఓ ప్రేమ కథ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాకు హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 Music Director Koti Released A Vikram Movie Song , Naga Varma, Tollywood , Bolly-TeluguStop.com

హీరో గా నటించిన నాగ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

కాగా ఈ చిత్రంలోని “చుక్క లాంటి అమ్మాయి…” అంటూ సాగే మొదటి పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ పాటను పృథ్వి చంద్ర ఆలపించగా.సురేష్ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.సత్య మాస్టర్ నృత్య రీతులను సమకూర్చారు.పాటను విడుదల చేసిన అనంతరం కోటి మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని పాటలన్నీ నేను విన్నాను.చాలా బావున్నాయి.

అలాగే చిత్ర కథ కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది.నేటి యువతరం ఆలోచనా విధానానికి దగ్గర గా ఉంటుంది.

Telugu Koti, Naga Varma, Telugu, Tollywood, Vikram-Movie

హీరో నాగ వర్మ ఈ చిత్రానికి నిర్మాత కూడా కావడాన్ని బట్టి ఆయన అభిరుచి ఏంటో అర్ధమవుతోంది.నా ప్రియ శిష్యుడు సురేష్ ప్రసాద్ సంగీత దర్శకుడి గా పరిచయం అవుతుండటం ఆనందం గా ఉంది” అని అన్నారు.హీరో, నిర్మాత నాగ వర్మ మాట్లాడుతూ “మా అభిమాన సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా మొదటి లిరికల్ సాంగ్ విడుదల కావడం ఆనందంగా ఉంది.ఇక ఈ చిత్ర కద విషయానికి వస్తే…ఓ సినిమా రైటర్ అన్నీ తననే నమ్మి తనతో ప్రేమలో పడితే…తను మాట మార్చగా సమాజంలోని కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే… వాళ్లకి కలిసే ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ప్రధాన ఇతివృత్తం.

చిత్రం కమర్షియల్ హంగుల తో చాలా బాగా వచ్చింది.త్వరలో విడుదల చేస్తాం” అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube