మ్యూజిక్ అంటే ప్రాణం, చేసే పనిలో శ్రద్ధాసక్తులు ఉంటే మన విజయం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేము అనేదానికి నిలువెత్తు నిదర్శనం ప్రముఖ సంగీత దర్శకుడు గౌర హరి.( Music Director Hari Gowra ) యాడ్స్, టీవీ సీరియల్స్‌తో ఆయన సంగీత ప్రస్థావన మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా సినిమా హనుమాన్‌కు( HanuMan Movie ) పనిచేసే స్థాయికి ఎదిగారు.
ప్రశాంత్ వర్మ దర్శకుడిగా తెలుగులో సూపర్ హీరో సినిమా హనుమాన్ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు.హనుమాన్ సినిమాలో సంగీత దర్శకుడు అనుధీప్ దేవ్ ఆవకాయ అంజనేయ అనే సాంగ్ కంపోజ్ చేశారు.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ ఒక ఎమోషనల్ సాంగ్ చేశారు.ఇక సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి చేశారు.

గౌర హరి ఈ చిత్రానికి దాదాపు రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి సంగీతాన్ని సమకూర్చారు.ముఖ్యంగా ఇప్పటి వరకు విడుదల అయిన బీజీఎమ్, హనుమాన్ చాలీసా , శ్రీరామ దూత స్తోత్రం ,ఎంత ప్రభంజనం సృష్టించాయో మనకు తెలుసు.ఆ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటే దానికోసం గౌర హరి( Gowra Hari ) ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా, తీసిన విజువల్స్ ను మరోక మెట్టు ఎక్కించడంలో సంగీత దర్శకుడిగా గౌర హరి వంద శాతం విజయం సాధించారు.
ఇక పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన గౌర హరి మరిన్ని అద్భుతమైన చిత్రాలకు తన మార్క్ చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక హనుమాన్ ప్రొమోషన్లలో లో కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ,( Director Prashanth Varma ) గౌర హరి పనితనం గురించి ఎంతో గొప్పగా పొగిడారు.బీజీఎమ్ అద్భుతంగా ఇచ్చారని, గౌర హరి పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుందని పేర్కొన్నారు.రెండు సంవత్సరాలుగా అంతే ఉత్సాహంతో ఒకే సినిమాకు పనిచేయడం గ్రేట్ అని హీరో తేజ సజ్జ కొనియాడారు.
ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత కన్న ఎక్కువే పెట్టారు, అందుకే ట్రైలర్‌కు అంత రీచ్ వచ్చిందని హీరో వెల్లడించారు.సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన గౌర హరి హనుమాన్ తరువాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించారు.







