Munugodu : మునుగోడులో గెలిచిన,ఓడిన పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు.. ఎందుకంటే?

మునుగోడు ఉప ఎన్నికలో 10 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన విషయం తెలిపిందే.సర్వ శక్తులు వడ్డి బీజేపీని పక్కా ప్లాన్‌తో టీఆర్‌ఎస్‌ ఓడించింది.

 Munugode Both Trs Bjp Have Nothing To Cheer, Munugode, Trs, Bjp, Telangana, Poli-TeluguStop.com

అదే సమయంలో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి బీజేపీ నైతిక విజయాన్ని అందుకుంది.అయితే ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు గెలవడానికి సర్వశక్తులు వడ్డాయి.

ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్ ఎంతగానో చెమటోడ్చించింది, దాదాపు అందరూ మంత్రలను, ఎమ్మెల్యేలను బరిలోకి దించింది.ఇక ఎన్నికలో రెండు పార్టీలు భారీగా ఖర్చు పెట్టాయి.

టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటం వల్ల సహజంగా లభించిన ప్రయోజనం కారణంగానే గెలించిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉందని భావిస్తే మాత్రం లెక్క తప్పని విశ్లేషకులు అంటున్నారు.

ఇక బీజేపీ విషయానికొస్తే ఈ ఎన్నికలో రెండో స్థానం సరిపెట్టుకున్న.పెరిగిన ఓట్ల శాతం అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే మద్దతు ఉందని అర్థమవుతుంది.అయితే ఇది పూర్తిగా బీజేపీ బలం కాదు.2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఇంత పెద్దయేత్తున ఓట్లు లభించలేదు.కానీ గత మూడేళ్ళుగా బీజేపీ తెలంగాణలో బలపడుతూ వస్తుంది.ఈ రకమైన పరిస్థితి కొనసాగితే బీజేపీ 2024లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ విషయంలో బీజేపీ అధిక సీట్లు సాధించడం అంత సులువు కాదని తాజా మునుగోడు ఎన్నికతో అర్ధమవుతుంది.

Telugu Bjp Telangana, Munugode-Political

అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన మాత్రనా.సంతోష పడాల్సిన అవసరం లేదని.ఓడినంత మాత్రనా బాధపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే పరిస్థితులు బట్టి అభ్యర్థుల గెలుపోటములు ఉంటాయని.ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల్లో ప్రభావం చూపోచ్చు కానీ.2024లో ఇది సాధ్యం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube