ఏపీలో ఇవాళ్టి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు.తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా ఎప్పటినుంచో ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ సర్కార్ స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.కాగా ఏపీలో ఇప్పటికే గత పదిహేను రోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.