అప్పుడే పుట్టిన శిశువు గర్భంలో మరో శిశువు

రెండు తలలతో పుట్టిన శిశువు గురించి చాలాసార్లు విన్నాం.ఇక ఒకే గర్బంలో ఇద్దరు, ముగ్గురు పుట్టడం వింత విషయం కాదు.

 Mumbai Mother Delivered A “pregnant” Baby Boy-TeluguStop.com

ఇద్దరు శిశువులు అంటుకొని పుట్టడం కూడా చాలాసార్లు చూసాం.కాని పుట్టగానే గర్భంతో పుట్టిన శిశువుని ఎప్పుడైనా చూసారా? అదికూడా గర్భంలో మరో శిశువుతో.అందులోనూ ఒక మగశిశువుని.ఇలాంటి వింత ఎక్కడో కాదు, మన దేశంలోనే జరిగింది.ముంబైలో జరిగింది.

అది ముంబైలోని ముంబ్రా ప్రాంతం.

థానే జిల్లాలోని ఓ ప్రముఖ ఆస్పత్రి.జులై 20న జన్మించిన ఓ మగశిశువు తన కావల తమ్ముడితో బయటకి వచ్చాడు.

అయితే మిగితా కావల పిల్లల్లా ఆ పసికందు తలి గర్భంలో డైరెక్ట్ గా కాకుండా, తల్లి గర్భంలో ఉన్న అన్న గర్భంలో పెరిగాడు.కాని అసంపూర్తిగా పెరిగాడు.

చాలా అరుదైన ఈ కండీషన్ పేరు “Foetus in Foetu” అని డాక్టర్లు చెప్పారు.ఇందులో పూర్తిగా పెరిగిన బిడ్డను, లేదా తల్లి గర్భంలో సాధారణంగా పెరిగిన బిడ్డను “Host Baby” అని అంటారు.

పసికందు గర్భంలో ఏర్పడిన బిడ్డను “Parisitic Twin” అని అంటారు.ఈ పరిసిటిక్ ట్విన్ ఆ పసివాడి గర్భంలో 7 సెంటిమీటర్ల మేరకు ఏర్పడింది.

టైటాన్ హాస్పిటల్ హెడ్ గైనాకోలోజిస్ట్ నీనా నిచ్లాని ఈ సందర్భంగా మాట్లాడుతూ “మొనోజైగోటిక్ ట్విన్ ప్రెగ్నెన్సి ఒకవేళ ఒకే ప్లాసెంటాను పంచుకుంటే ఇలా జరుగుతుంది.ఇలాంటి సందర్భాల్లో గర్భం లాంటిది ఏర్పడి హోస్ట్ లో మరో పసికందు పెరగడం మొదలుపెడుతుంది.

ఇది బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలాంటి కేసుల్లో చాలాసార్లు శిశుమరణాలు సంభవించాయి.

ఎందుకంటే ఈ ఫేటస్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు” అంటూ ఈ వింత వెనుక ఉన్న సైన్స్ ని వివరించారు.

ఇక ఆ బిడ్డ కడుపులో ఏర్పడిన బిడ్డని సర్జరీ ద్వారా తొలగించారు.

ముందే చెప్పాంగా, ఆ బిడ్డ పూర్తిగా ఎదగడం లేదు అని.ఊపిరితిత్తులు వచ్చినట్టే వచ్చాయి, కొన్ని ఎముకలు కూడా చిన్నగా మెదడు కూడా ఏర్పడింది.కాని ఏమి లాభం, వెన్నుముక్క లేదు అలాగే స్కల్ బోన్ లేదు.దీంతో పూర్తిగా ఎదిగిన బిడ్డ ప్రాణాలకి ప్రమాదం.అందుకే సర్జరీ ద్వారా పుట్టిన నాలుగోవ రోజునే తొలగించారు.

ఇక ఇలాంటి వింత ఇప్పుడే మొదటిసారి జరిగిందా ? ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదా ? ఇవే కదా మీ డౌట్లు.ఇండియాలో కూడా ఇలాంటి కేసులు ఇదివరకు చూసారు.మొత్తం ప్రపంచవ్యాప్తంగా Foetus in Foetu కేసులు దాదాపుగా 200 వరకు రికార్డులో ఉన్నాయని సమాచారం.18వ శతకంలో ఇలాంటి కేసులు కనిపించాయట.50 లక్షల డెలివరీలలో ఒకటి ఇలా జరిగే అవకాశం ఉంటుంది.ఇది నార్మల్ కండీషన్ కాదు.అబ్నార్మల్ మరియు అనారోగ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube