విలువైన సంపద, నగలు తయారీ విషయంలో భారతదేశం పెట్టింది పేరు.అందుకే ఆనాడు బ్రిటిష్ వాడు మనపైన పడి దోచుకున్నాడు.
ఈ క్రమంలోనే విలువైన దేశసంపద కోహినూరు( Kohinoor )ని కోల్పోయాం.ఇపుడు ఈ తంతంతా ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.అద్భుతమైన స్వర్ణకారులు మనకి అందుబాటులో వున్నారు.అదేవిధంగా వివిధ నగల వ్యాపారాలు ప్రతి ఏటా చాలా ప్రత్యేకమైన నగలను రూపొందిస్తుంటారు.మరీ ముఖ్యంగా రికార్డు స్థాయిలో డిమండ్ రింగ్స్ ని రూపొందించి వార్తల్లో నిలుస్తూ వుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా 50,907 వజ్రాలతో పొదిగిన మన భారతీయ ఆభరణాల ఉంగరం ప్రపంచ రికార్డును సాధించింది.అంటే ఇక్కడ ఒకే ఉంగరం( Ring )లో అత్యధికంగా 50,907 వజ్రాలను అమర్చడం జరిగింది.దాంతో ఇది ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.2023 మార్చి 11న ముంబైలోని హెచ్‌కె డిజైన్స్, హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని సాధించాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా ప్రకటించింది.ఇకపోతే ఇది పూర్తిగా రీసైకిల్ చేసిన బంగారం, వజ్రాలతో తయారు చేయబడింది.
అదేవిధంగా ఇది కస్టమర్ల నుంచి వచ్చిన రాబడి నుంచి తయారుచేసినదని సమాచారం.హెచ్‌కె డిజైన్స్ ప్రకారం, ఈ రింగ్ విలువ $7,85,645 అంటే మన రూపాయలలో ₹6.4 కోట్లు ఉంటుందని అంచనా.

అదే విధంగా 2021లో మన దేశానికి చెందిన ఓ నగల వ్యాపారి గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Record )లో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే.ఈ నగల వ్యాపారి ఒకే ఉంగరంలో 12,368 వజ్రాలను పొదగడం జరిగింది.కాగా ఆ రికార్డుని తాజాగా హెచ్‌కె డిజైన్స్, హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రేక్ చేసారు.2021లో ఆ రికార్డుని మీరట్ లోని రెనానీ జ్యువెలరీ వ్యవస్థాపకులు హార్షిత్ బన్సాల్ నెలకొల్పారు.కాగా వారు అచ్చం మ్యారీ గోల్డ్ పువ్వు మాదిరిగా వజ్రాలతో కూడిన రింగును తయారు చేయడం జరిగింది.
అంతకుమునుపు ఈ గిన్నిస్ ప్రపంచ రికార్డు అనేది హల్ మార్క్ జ్యువెలురీ పై ఉండేది.ఆ రికార్డులో 7,801 వజ్రాలను ఒకే రింగులో పెట్టి రికార్డు నెలకొల్పింది.







