చిన్న బట్టలు వద్దు అన్న కాలేజిలు - అమ్మాయిల నిరసన

ముంబై … అత్యంత ట్రెండీ భారతీయ నగరం.డిల్లీ కాపిటల్ సిటి కావచ్చు కాని, అత్యంత మోడరన్ సిటి ఏంటి అంటే మాత్రం ముంబై పేరే గుర్తుకువస్తుంది.

 Mumbai Colleges Put Ban On Short Clothes – Girls Object The Ban-TeluguStop.com

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే, ముంబై కాలేజి అమ్మాయిల బట్టలు రోజురోజుకి చిన్నగా అయిపోతున్నాయట.బయట పార్టీలకో, షికారుకు వెళ్ళినప్పుడు వేసుకుంటే ఫర్వాలేదు కాని క్లాస్ రూమ్ లో కూడా వారి ఫ్యాషన్ సెన్స్ మరీ ఎక్కువ అయిపోయేసరికి, కొన్ని కాలేజిలు యాక్షన్ తీసుకోక తప్పలేదు.

సెయింట్ జేవియర్ కాలేజి, విల్సన్ కాలేజి .ఇంకా కొన్ని కాలేజీలు చిన్న బట్టలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి.అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఫ్యాషన్ పేరుతొ చిరిగిపోయిన జీన్స్, చిట్టిపొట్టి బట్టలు వేసుకొని కాలేజికి రాకూడదని, వచ్చిన అనుమతించేది లేదు అని స్పష్టం చేసాయి.అంతేకాదు, రాత్రి 7 గంటల తరువాత కాలేజి క్యాంపస్ లో ఏ ఒక్క అమ్మాయి కూడా కనబడకూడదట.7 గంటల తరువాత క్యాంపస్ లో అమ్మాయిలు తిరిగితే, తల్లిదండ్రులని పిలిపించి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించాయి కాలేజి యాజమాన్యాలు.బట్టలపై, క్యాంపస్ లో రాత్రి తిరగడంపై పెట్టిన నిషేధాన్ని ప్రకటిస్తూ, కాలేజి బయట బోర్డులు కూడా పెట్టేసారు.

అయితే, కాలేజీలు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకి నచ్చలేదట.ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా కాలేజి నిర్ణయిస్తే ఎలా అని నిరసనకి దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube