పది కంటే ఎక్కువ ఉంటే సీల్ వేస్తాం అంటున్న బీఎంసీ

పదికంటే ఎక్కువ కరోనా కేసులు గనుక నమోదు అయితే అలాంటి గ్రూప్ హౌస్ లను మూసివేస్తాం అంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

కరోనా మార్గదర్శకాల్లో మార్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మంగళవారం నాడు ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తుంది.

అయితే.ఓ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే మాత్రం ఆ భవంతిని పాక్షికంగా సీల్ చేస్తామని బీఎంసీ స్పష్టం చేసింది.

Building With 10 Or More Covid Cases To Be Sealed, Mumbai, BMC, Municipal Corpor

అయితే గతంలో కేసులు వెలుగు చూసిన సమయంలో ఏ అంతస్తులో అయితే కరోనా కేసులు నమోదు అవుతాయో ఆ అంతస్తు మాత్రమే సీల్ చేస్తానని చెప్పిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన మార్గదర్శకాల్లో భాగంగా పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే భవంతి మూసివేసే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారాలను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ లేదా మెడికల్ హెల్త్ ఆఫీసర్‌కు భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.

ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 వేలకు పైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఇక మంగళవారం నాడు ముంబైలో కొత్తగా 1,585 కరోనా కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.

Advertisement

ఒకపక్క రాష్ట్రంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో సీల్ చేసిన భవంతుల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం ముంబైలో 8763 భవంతులను అధికారులు సీల్ చేసినట్లు తెలుస్తుంది.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు