Mudragada Padmanabham : వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం..!?

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలోకి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 Mudragada Padmanabham : వైసీపీలోకి ముద్రగడ -TeluguStop.com

ఆయనను పిఠాపురం నుంచి బరిలో దింపే అవకాశం ఉందని తెలుస్తోంది.లేదంటే ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీ పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత( Vanga Geetha )కు సీఎంవో నుంచి పిలుపువచ్చిందని సమాచారం.

పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ను మార్చే దిశగా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుందని తెలుస్తోంది.ముద్రగడను పార్టీలోకి చేర్చుకుని పిఠాపురం నుంచి పోటీకి దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందని ప్రచారం సాగుతోంది.మరోవైపు పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency ) నుంచి జనసేన పార్టీ తరపున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడను పోటీలో నిలపాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోందని సమాచారం.దీంతో పిఠాపురం నియోజకవర్గంలోని రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube