తన దీక్షకు పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూకాపు నాడు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం .కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరహార దీక్ష చేపట్టిన ముద్రగడను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అనుమతించక పోవటంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ్రపవేశించిన విషయం విదితమే.
ఈ క్రమంలో ఆయనని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, ఆతని అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు.ఈ సమయంలోనే తన చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా మూత తీసి గొంతులో పోసుకున్నారు ముద్రగడ.
ఇది గమనించిని పోలీసులు పురుగుల మందు బాటిల్ లాక్కొని, ఓ వైపు ముద్రగడ అనుచరులను చెదరగొడుతూ, ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతానికి ప్రమాదం లేదని వైద్యనిపుణులు చెప్తుండగా, పరిస్థితి ఆందోళన కరంగా మారిందంటూ ముద్రగడ అనుచరులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు.
ముద్రగడకు ఏం జరిగినా ్రపభుత్వమే బాధ్యత వహించాలని నినదిస్తున్నారు.
దీక్షలకు ప్రభుత్వం తలొగ్గేది లేదని, ముద్రగడ దీక్షను సమర్థంగా ఎదుర్కొంటామని పేర్కొంటూ ఏపీ హోంమంత్రి చినరాజప్ప రాజమహేంద్రవరంలో ప్రకటించిన కొద్ది సేపటికే ముద్రగడ అరెస్టు జరగటం విశేషం.







