కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు( MP Lavu Srikrishna Devarayalu ) రాజీనామా చేయడం తెలిసిందే.ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు.శనివారం తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshminarayana )తో బేటి అయ్యారు.
ఈ భేటిలో శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎన్నారై వైద్య నిపుణుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొనడం జరిగింది.అనంతరం స్థానికంగా న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికలలో మళ్లీ నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఈసారి ఎన్నికల్లో పలువురు వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించడం లేదా స్థానచలనం కల్పించారు.ఈ క్రమంలో నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్థానం కూడా గల్లంతు అయింది.
దీంతో వైసీపీ( YCP )కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు.కాగా ఇప్పుడు 2024 వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీకి సిద్ధపడుతున్నారు.
ఇటీవలే నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా అనిల్ కుమార్( Anil Kumar ) నీ వైసీపీ అధిష్టానం నియమించడం జరిగింది.