మేకప్ కోసం 75,000 అడిగింది

హైదరబాది టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జాపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.అందుకు ఆ అమ్మడు మధ్యప్రదేశ్ గవర్నమెంటుతో ప్రవర్తించిన తీరే కారణం.

 Mp Government Condemns Sania Demands-TeluguStop.com

ఆటలను ఎంకరేజ్ చేయాలని, దీనికి గవర్నమెంటు చర్యలు తీసుకోవాలని ప్రసంగాలు చేసే సానియా, ఇప్పుడు తన ప్రసంగాలకు పుర్తి వ్యతిరేకంగా ప్రవర్తించింది.

విషయంలోకి వెళ్తే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏట ప్రభుత్వ క్రీడ పురస్కారాలు ఇస్తారు.

క్రీడల్లో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది.గత ఏడాది సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రిడలపై అక్కడి యువతలో స్ఫూర్తిని నింపింది.

ఈసారి సానియాను ఆహ్వానించారు.మరి మన సానియా మత్రం గొంతెమ్మ కోరికలు కోరింది.75,000 మేకప్ కిట్, తనకు, తన అసిస్టెంట్లకు కలిపి అయిదు బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, అందరికి స్టార్ హోటల్ లో వసతి అడిగిందట.అడిగినవన్ని ఇస్తేనే వస్తానని, లేదంటే రానని తెగేసి చెప్పిందట.

సానియా కోరికలకు నో చెప్పింది ప్రభుత్వం.మధ్యప్రదేశ్ క్రీడశాఖ మంత్రి యశోధర రాజే ఇంత ఖర్చు పెట్టి సానియాని పిలవాల్సిన అవసరం లేదని పుల్లెల గోపిచంద్ ను ముఖ్య అతిథిగా ఫిక్స్ చేసేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube