టీడీపీతో కటీఫ్.. ఆ ఇద్దరి దారెటు ?

ప్రస్తుతం టీడీపీ( TDP ) వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వీలైనంతవరకు చేరికలను ఆహ్వానించాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది.

 Mp Galla Jayadev And Mp Kesineni Nani Inactive In Tdp Details, Chandrababu Naidu-TeluguStop.com

అయితే ఆల్రెడీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం టీడీపీకి షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు.గత కొన్నాళ్లుగా విజయవాడ ఎంపీ కెసినేని నాని( MP Kesineni Nani ) టీడీపీపై అలాగే అధినేత చంద్రబాబుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

దాంతో ఆయన పార్టీ మారతారనే వాదన ఆ మద్య బాగా వినిపించింది.కానీ తాను పార్టీ మారడం లేదని గతంలోనే క్లారిటీ ఇచ్చారు కెసినేని నాని.

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Inactive-Politics

అయితే పార్టీ కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉంటూ ఉండడం గమనార్హం.ఇక పోతే గతంలో టీడీపీలో ఫుల్ యాక్టివ్ గా కనిపించే ఎంపీ గల్లా జయధేవ్( MP Galla Jayadev ) కూడా ప్రస్తుతం ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు.ఆయన ఎందుకు ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేనప్పటికి ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడని టాక్.దీంతో కేసినేని నాని మరియు గల్లా జయధేవ్ ల యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.

కేసినేని నాని వైసీపీలో చేరే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వినిపించాయి.

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Inactive-Politics

దీంతో ఎన్నికల ముందు ఆయన పార్టీ మారతారా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.అయితే ఈ ఇద్దరి నేతల అసంతృప్తికి కారణాలు ఏవైనప్పటికి ఒకవేళ వారు టీడీపీని విడితే మాత్రం ఆ పార్టీకి గట్టి దేబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే చంద్రబాబు( Chandrababu Naidu ) వ్యూహాత్మకంగానే వీరిని పక్కన పెడుతున్నారా లేదా వీరే పార్టీకి దూరమౌతున్నారా అనేది ఆసక్తి రేపే ప్రశ్న.

ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీకి కీలక నేతలు దూరమైతే ఆ పార్టీ బలహీన పడే అవకాశం ఉంది.మరి వీరి అసంతృప్తి పై చంద్రబాబు బుజ్జగింపు చర్యలు చేపడతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube