హరికృష్ణ సినిమా జీవితంలో నిలిచిపోయిన పాత్రలు..

ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వ్యక్తి హ‌రికృష్ణ.బాలనటుడిగా కేవలం 11 ఏండ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేశాడు.

శ్రీకృష్ణావ‌తారం అనే సినిమాలో చిన్నికృష్ణుడి రూపంలో దర్శనం ఇచ్చాడు.ఆ తర్వాత అద్భుత సినిమాల్లో చక్కటి పాత్రలు పోషించారు.త‌ల్లా? పెళ్లామా?, తాత‌మ్మ క‌ల‌, రామ్ రహీమ్, దాన వీర శూర క‌ర్ణ లాంటి ఎవర్ గ్రీన్ మూవీల్లో చక్కటి పాత్రలు పోషించాడు.అనంతరం సుమారు 20 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.

మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి నట వారసుడు.ఓ రేంజిలో ఇండస్ట్రీని ఏలాడు.

ఇంతకీ ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టిన క్యారెక్టర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

*అర్జునుడు

నందమూరి తారక రాముడి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సూపర్ హిట్ మూవీ దానవీర శూరకర్ణ.

Advertisement
Movies Which Are Milestones In Harikrishna Career, Arjunudu, Harikrishna, Tollyw

ఇందులో అర్జునుడి పాత్రలో అద్భుతంగా నటించాడు హ‌రికృష్ణ.ఆయన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ అర్జునుడిగా నిలిచిపోతుంది.

*కామ్రేడ్ స‌త్యం

Movies Which Are Milestones In Harikrishna Career, Arjunudu, Harikrishna, Tollyw

మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా శ్రీరాముల‌య్య.ఇందులో గిరిజ‌నుల జీవితాల మార్పు కోసం తన జీవితాన్నే త్యాగం చేసే న‌క్సలైట్ స‌త్యం పాత్ర‌లో ఒదిగిపోయాడు హ‌రికృష్ణ‌.

*సీతయ్య

Movies Which Are Milestones In Harikrishna Career, Arjunudu, Harikrishna, Tollyw

నాగార్జునతో కలిసి నటించిన సినిమా సీతారామరాజు.ఈ మూవీలో నాగార్జున అన్న సీతయ్యగా నటించాడు.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

*కృష్ణ‌మ నాయుడు

ఈ సినిమాలో ఇంటి పెద్దకొడుకు పాత్రలో అద్భుతన నటన కనబర్చాడు హ‌రికృష్ణ.తన అద్భుత డైలాగులతో జనాలు బాగా ఆకట్టుకున్నాడు.

*సీత‌య్య

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఎవరి మాట వినడు సీతయ్య అంటూ ఈ సినిమాలో గర్జించాడు హ‌రికృష్ణ.ఇందులో పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. ఎవరి మాట వినడు సీతయ్య అనే డైలాగ్ ఇప్పటికీ జనాల నోళ్లలో వినిపిస్తుంది.

*టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్

Advertisement

రైతు నాయకుడిగా ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చాడు హ‌రికృష్ణ‌.టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ ప్ర‌సాద్ గా రైతుల సమస్యలను ఎలుగెత్తి చాటాడు.

*ఆనంద భూప‌తి

శివ‌రామ‌రాజు సినిమాలో ఆనంద భూప‌తి పాత్ర పోషించి అద్భుతం అనిపించాడు హరి.ఇచ్చిన మాట కోసం తలనరుక్కునే వాడిగా.కీర్తి గడిస్తాడు.

ఈ సినిమాలో పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

తాజా వార్తలు