హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమా మే 6న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ఒక ప్రాంక్ వీడియో ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతోంది.ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.
అంతే కాకుండా ఈ వ్యవహారం హీరో విశ్వక్ సేన్ పై అలాగే చిత్ర యూనిట్ పైన చర్యలు తీసుకోవాలంటూ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది.
ఆ ఫ్రాంక్ వీడియోలో సినిమాలు విడుదల రోజు థియేటర్స్ వద్ద ఉంటూ పిచ్చిపిచ్చి రివ్యూలు ఇస్తూ హంగామా చేసే రివ్యూ లక్ష్మణ్ తో కలిసి విశ్వక్ సేన్ చేసిన ఈ వీడియో పెద్ద వివాదాన్ని సృష్టించింది.
లక్ష్మణ్ కూడా ఒంటిపై పెట్రోలు పోసుకున్నట్టుగా హడావిడి చేస్తూ పబ్లిక్ లోనే నానా హంగామా చేశాడు.ఈ ఫ్రాంక్ వీడియో వైరల్ కావడంతో.టీవీ డిబేట్‌లకు రేటింగ్ కంటెంట్ దొరికేసిందని సంబరపడిపోతూ దీనిపై డిబేట్‌లు పెట్టేశారు.అయితే ఈ డిస్కషన్స్‌లో విశ్వక్ సేన్‌ని పాగల్ సేన్ అని కించపరుస్తూ యాంకర్ మాట్లాడటంతో.
మనోడు నోటికి పని చెప్పి బూతులతో రెచ్చిపోయాడు.

దీంతో ఆ యాంకర్ విశ్వక్ సేన్‌ని గెటౌట్ అంటూ బయటకు గెంటేసింది.ఈ వివాదానికి కారణమైన రివ్యూ లక్ష్మణ్ ఈ వివాదంపై స్పందించాడు.మేం మూవీ ప్రమోషన్స్ మాత్రమే చేశాం.
డైరెక్షన్ టీం చెప్పినట్టే నేను చేశాను.నేను పెట్రోల్ పోసుకున్నట్టు చేశాం కానీ అందులో ఉన్నది పెట్రోల్ కాదు.
వాటర్.అది జనానికి కూడా తెలుసు.
మేం ఎవరికీ ఇబ్బంది లేకుండానే ఫ్రాంక్ వీడియో చేశాం. కేసులు అదీ ఇదీ అంటున్నారు.
బూతులు తిట్టిస్తున్నారు.ముందు వాళ్లపై కేసులు పెట్టాలి.
ట్రాఫిక్‌కి కూడా మేం అభ్యంతరం కలిగించలేదు.నిజంగానే ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాం అనీ తెలిపాడు రివ్యూ లక్ష్మన్.








