బాలయ్య,కే ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో మూవీ.... ప్రత్యర్థి విలన్ గా లేడీ

నందమూరి వారసుడు గా బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ఒక పెద్ద స్టార్ గా ఎదిగారు.

ఎక్కువగా మాస్,ఫ్యాక్షన్ సినిమా లో నటించి మెప్పించే ఆయన తాజా గా మరో చిత్రంలో నటిస్తున్నారు.

జై సింహ దర్శకుడు కే ఎస్ రవికుమార్,బాలయ్య కాంబినేషన్ లో ఒక చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.అయితే బాలయ్య సినిమా లలో ప్రత్యర్థి విలన్ లు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

Movie In Combination Of Balaya And Ks Ravikumar-బాలయ్య,కే ఎ�

దాదాపు ఆయన చేసిన చాలా సినిమాలలో ప్రత్యర్థి విలన్ లుగా జగపతిబాబు,ప్రకాష్ రాజ్,ముఖేష్ రుషి,షాయాజీ షిండే ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు.అయితే ఇప్పుడు బాలయ్య కు ప్రత్యర్థి విలన్ గా ఒక లేడీ నటిస్తుందట.

ఇంతకీ ఆ లేడీ విలన్ ఎవరో కాదండి హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్.బాలయ్య,కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య ను ఎదుర్కోబోతుందట.

Advertisement

ఇటీవల కాలంలో లేడీ విలన్ గా పలు చిత్రాల్లో మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు ఏకంగా బాలయ్య కు ప్రత్యర్థి విలన్ గా అవకాశము కొట్టేసింది.దీనితో ఇప్పుడు ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయ్, ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే.అలాగే విశాల్ పందెంకోడి 2 చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మి నటించారు.

ప్రస్తుతం చాలా పెద్ద ప్రాజెక్టు లతో బిజీ గా ఉన్న వరలక్ష్మి కి కే ఎస్ రవికుమార్ లేడీ విలన్ గా బాలయ్య తో ధీటైన ప్రత్యర్థి గా ఆమెను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.అంతేకాకుండా ఈ చిత్రంలో ఆమె పాత్ర డైరెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం.

మరి ఇక బాలయ్య,వరలక్ష్మి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు