మెగా ఫ్యామిలీపై సినీ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉందని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదని శివాజీ పేర్కొన్నారు.అయితే ఎక్కడో చిన్న లోపం ఉందన్న ఆయన దాన్ని సరి చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.
బీజేపీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే బయటకు వచ్చానని చెప్పారు.ఈ క్రమంలోనే ఎన్నాళ్లని ఒంటరిగా పోరాడగలనని ప్రశ్నించిన శివాజీ తనకు కుటుంబం ఉందని పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని వెల్లడించారు.







