వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు.ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించడమే కాకుండా ఆయనకు మద్ధతుగా నిరసన తెలిపిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని నారా లోకేశ్ విమర్శించారు.శాంతియుత నిరసనలకు కూడా వీల్లేదని డీజీపీకి సీఎం జగన్ ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్న లోకేశ్ ప్రజలు నిరసన తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో లేని నిర్బంధాలు ఏపీలోనే ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని తెలిపారు.