చేతులు లేక‌పోయినా ఈమె చేస్తున్న ప‌నులు చూస్తే హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

సాధించాల‌నే త‌ప‌న ఉంటే ఎలాంటి ప‌ని అయినా చేయ‌గ‌లుగుతాం.అందుకు ఎలాంటి కార‌ణాలు మ‌న‌కు అడ్డురావు.

కొంద‌రు అన్నీ బాగానే ఉన్నా సోమ‌రిపోతుల్లా ఉంటారు.కానీ ఓ అమ్మాయి మాత్రం త‌న‌కు రెండు చేతులు లేక‌పోయినా కూడా ఎన్నో అద్భుతాలు చేసి చూపెడుతోంది.

అమెరికా దేశంలోని అరిజోనా ప‌ట్ట‌ణానికి చెందిన‌టువంటి జెస్సీకా కాక్స్ అనే అమ్మాయికి చిన్న‌త‌నంలో పుట్టుకతోనే చేతులు లేకుండానే పెరిగింది.కానీ ఆమె దాన్ని శాపంగా భావించి బాధ ప‌డుతూ కూర్చోకుండా తానేంటో నిరూపించుకోవాల‌నుకుంది.

అంద‌రిలాగే తాను కూడా త‌న జీవితాన్ని ఆశ్వాదిస్తూ ఆనందంగా జీవించాల‌ని అనుకుంది.దీంతో సాధార‌ణ మ‌నుషుల్లాగా ఆమె కూడా ఎన్నో విష‌యాల‌ను ఎంతో సునాయాసంగా నేర్చుకోవ‌డం ఇప్పుడు అంద‌రినీ షాక్‌కు గురి చేస్తుంది.

Advertisement

ఆమె రెండు చేతులు లేక‌పోయినా కూడా కారు నడపేస్తోంది.అంతే కాదు పియానో కూడా వాయిస్తుంది.

ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే సాధార‌ణ మ‌నుషులే భ‌య‌ప‌డే ప‌ని కూడా చేస్తుంది.త‌న కాళ్ల‌తో ఏకంగా విమానాన్ని కూడా నడుపుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ తానేంటో నిరూపిస్తోంది.అటు బాక్సింగ్‌లో కూడా ఆమె స‌త్తా చాటుతూ ఇప్ప‌టికే రెండు బ్లాక్‌ బెల్ట్ ల‌ను కూడా సొతం చేసుకుంది.కాగా త‌న‌కు బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చిన‌టువంటి పాట్రిక్ అనే వ్య‌క్తినే పెండ్లి చేసుకుని జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

ఇక తన లాంటి వారు ఉన్న చోట‌నే ఆగిపోకుండా చూడాలనే సంక‌ల్పంతో మోటివేషనల్‌ స్సీకర్‌గా మారి అంద‌రిలోనూ ఆత్మ స్థైర్యాన్ని పెంచుతోంది.అంతే కాదు ఆమె వికలాంగుల హక్కుల కోసం నిత్యం పోరాడుతూ ఎంద‌రికో అండ‌గా నిలుస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎంతైనా ఇలాంటి వారు ఎంద‌రికో స్ఫూర్తి దాయం క‌దా.ఇలాంటి వారిని చూసైనా కొంద‌రు మారాల‌ని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు