ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పెద్దలు చాలా జాగ్రత్తగా ఉంటారు.వారికి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
చిన్న పిల్లలు పొరపాటున ఆడుకుంటూ పడిపోవడం, పదునైన వస్తువులు పట్టుకోవడం వంటివి చేయకుండా కంటికి రెప్పలా కాపాడతారు.ఇక చిన్నారులతో కలిసి బయటికి పెద్దలు వెళ్తుంటారు.
ముఖ్యంగా ఆడుకునే వయసులో పిల్లలను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని, వారితో కలిసి సంతోషంగా గడపాలని పేరెంట్స్‌కు ఉంటుంది.ఆ సమయంలో ఏ మాత్రం కాస్త అజాగ్రత్తగా ఉన్నా, ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.తాజాగా కారులో వెళ్తూ, ఓ తల్లి అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఊహించని ప్రమాదం ఎదురైంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రోడ్లపై వాహనాలలో ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా వెళ్లాలని, ముఖ్యంగా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తుంటారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరిస్తుంటారు.వాటిని వాహనదారులెవరూ పట్టించుకోరు.
ముఖ్యంగా తమతో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా కొందరు పెద్దలు వ్యవహరిస్తారు.తాజాగా Idiots Nearly Dying అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
అందులో ఓ మహిళ తన పిల్లలతో కలిసి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలో వేగంగా తమ వాహనాన్ని పోనిస్తుంది.
వారు వెళ్లే దారిలో అడ్డంగా ఓ గేటు ఉంటుంది.

గేటు ముందు వాహనాన్ని స్లో చేయకుండా ఆమె ముందుకు వేగంగా పోనిచ్చేస్తుంది.ఆమె వ్యవహార శైలి వల్ల గేటుకు గుద్దుకుని ఓ చిన్నారి కింద పడిపోతుంది.ఆ మహిళ కూడా కిందపడి కాసేపు లేవలేక పోతుంది.
పిల్లలతో వెళ్లేటప్పుడు ఇలాంటి డేంజరస్ స్టంట్లు అవసరమా అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.చిన్నపాటి దెబ్బలను పెద్ద వాళ్లు తట్టుకుంటారని, అయితే పిల్లలు ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చని ఆంందోళన వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.







