తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే మొదలైన ఈ షో అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జబర్దస్త్ కమెడియన్లు కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్లో కూడా ఎవరో ఒక సెలబ్రేట్ ని ఇన్వైట్ చేయడం లేదంటే టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడం అలాగే ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్ తో ఒక మెసేజ్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాతగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎనిమిదేలుగా తల్లిదండ్రులకు దూరమైనా బిడ్డలను తల్లీ దగ్గరకు చేర్చింది.ఆ తల్లిదండ్రులకు బిడ్డలేరు అన్న బాధను తొలగించింది.
అసలేం పెరిగిందంటే మూడేళ్ల వయసులో స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి సింధూ ని ఒక మహిళ ఎత్తుకుపోయి ఎక్కడో వదిలేయగా ఆ చిన్నారి దిక్కుతోచనీ స్థితిలో అనాధగా మారి అనాధాశ్రమం చేరింది.మూడేళ్ల నుంచి ఇప్పటివరకు కూడా సింధు అనాదాశ్రమంలోనే ఉంటూ చదువుకుంటోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమం సిబ్బంది శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు ఈ చిన్నారులను తీసుకొచ్చారు.చిన్నతనంలో తప్పిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు భారం అనుకుని వదిలేసిన పిల్లలు ఆ షోలో ఆడిపాడి ఆనందంగా గడిపారు.ఈ ఏడాది జూన్ 19న టెలికాస్ట్ అయిన నాన్న నా హీరో షోలో ఏడో తరగతి చదువుతున్న సింధూ ను తల్లి అనురాధ గుర్తించి స్నేహితుల సహకారంతో ఆశ్రమం వివరాలు తెలుసుకొని బిడ్డను కలిశారు.కానీ సింధు మూడేళ్ల వయసులో తప్పిపోవడం వల్ల తల్లిని గుర్తించలేదు.
చిన్ననాటి ఫొటోలన్నీ చూపించి ఆ తల్లి, తరువాత తన బిడ్డను దగ్గర చేసుకుంది.ఈ ఆదివారం జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు అనూరాధ, సింధూ, ఇందూ పాల్గొన్నారు.
ఎనిమిదేళ్లగా లేదనుకున్న బిడ్డను చూసి తల్లి భావోద్వేగానికి గురైంది.ఆమెను కలిసిన రోజు సింధూ తనతో మాట్లాడలేదని, ఇంటికి రానని మారం చేసిందని తల్లి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు.







