బిగ్ బాస్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా చివరికి మిగిలేది వీళ్లేనట..!

ఈ ఏడాది నిన్న గాక మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.అప్పుడే 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఈ వారం ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 Most Popular Bigg Boss 7 Telugu Contestants Ormax, Bigg Boss 7 Telugu,ormax Sur-TeluguStop.com

ఈ వారం శుభ శ్రీ( Subhashree ) బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా, గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపించారు.దీనితో పాటు కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి ఒకేసారి పంపించారు.

రేపటి నుండి ఆట మరింత రసవత్తరంగా సాగనుంది.కొత్త కంటెస్టెంట్స్ మరియు పాత కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?, ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా మెప్పిస్తారు అనేది ఉత్కంఠ ని కలుగచేసే విషయం.

ఇకపోతే ఈ సీజన్ లో ఎవరు హౌస్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం గా మారింది.మన ఊహలకు అందని విధంగా మొత్తం ‘ఉల్టా పల్టా’ గా ఉంటుంది.కానీ ఆర్మాక్స్ అనే సంస్థ బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్( Bigg Boss 7 Top 5 Contestants ) గా మిగిలేది ఎవరో చెప్పేసింది.అందరూ ఊహించినట్టుగానే శివాజీ( Shivaji ) టాప్ 1 స్థానం లో ఉన్నాడు.

ఈయన ప్రతీ వారం తనకి ఉన్న గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్నాడు.దానికి తోడు నాగార్జున కూడా ఇతనికి సపోర్టు ఉండడం వల్ల ఆడియన్స్ లో కూడా శివాజీ క్రేజ్ బాగా పెరిగిపోయింది.

ఇక ఆయన తర్వాతి స్థానం లో అమర్ దీప్( Amardeep ) ఉన్నాడు.ఇతను వేసే వేషాలు మొత్తం చిన్న పిల్లాడి లాగా ఉంటాయి కానీ, టాస్కుల విషయం లో బాగా ఆడుతాడు కాబట్టి ఇతనికి కూడా ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంది.

ఇక సామాన్య రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, టాస్కులో విషయం లో కంటెస్టెంట్స్ ని పరుగులు తియ్యిస్తున్న పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మూడవ స్థానం లో ఉన్నాడు.ఇక పెద్దగా టాస్కులు ఆడకపోయినా కూడా తన క్యూట్ అందం తో ప్రేక్షకులను కట్టిపారేస్తున్న ప్రియాంక జైన్( Priyanka Jain ) నాల్గవ స్థానం లో ఉండగా, ఇచ్చిన టాస్కుకి ప్రాణం పెట్టి మరీ ఆడుతున్న యావర్( Prince Yawar ) టాప్ 5 స్థానం లో ఉన్నట్టుగా ఆర్మాక్స్ సంస్థ ప్రకటించింది.మరి ఆ సంస్థ చెప్పినట్టుగానే నిజంగా జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube